

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ "అరుంధతి హిందీ రీమేక్" కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ రీమేక్‌కు దర్శకుడిగా "తని ఒరువన్", "గాడ్ ఫాదర్" ఫేమ్ మోహన్ రాజా ఎంపికైనట్టు సమాచారం. తెలుగులో లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు మోడ్రన్ టచ్‌తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హిందీలో రూపుదిద్దుకోబోతుందట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతోందని బజ్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కాగా, ప్రధాన తారాగణం ఫైనల్ దశలో ఉందట.
జేజమ్మ పాత్రలో శ్రీలీల!
తెలుగులో అనుష్క చేసిన "అరుంధతి"పాత్రలో ఇప్పుడు బాలీవుడ్ వెర్షన్లో నటించబోతున్నది టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ స్టార్ శ్రీలీల. ఆమెను ఈ పాత్రకు సెట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. శ్రీలీల డ్యాన్సింగ్ స్కిల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నందున, అనుష్క ఇమేజ్‌కి దగ్గరగా తీసుకురాగలమని ఫిల్మ్ యూనిట్ నమ్ముతుందని తెలుస్తోంది. అయితే, నెటిజన్ల నుంచి మాత్రం మిక్స్డ్ టాక్ వస్తోంది. "అనుష్క జేజమ్మ పాత్ర అనేది ఒక లెజెండ్, దాన్ని ఎవ్వరూ రీ-క్రియేట్ చేయలేరు" అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు "శ్రీలీల యాక్టింగ్‌కి ఛాన్స్ ఇస్తే ఆమె కూడా సర్ప్రైజ్ చేయగలదు" అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పశుపతిగా సోను సూద్?
తెలుగులో "అరుంధతి" సినిమాకి ప్రధాన హైలెట్‌గా నిలిచింది పశుపతి పాత్ర. ఈ పాత్రలో నటించిన సోను సూద్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను భయపెట్టాడు. ఇప్పుడు హిందీ వెర్షన్లో కూడా అదే పాత్రను మళ్లీ సోను సూద్ చేయబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన నెగటివ్ రోల్స్‌లో చూపిన ప్రావీణ్యం దృష్ట్యా ఈ కాస్టింగ్ సరిగ్గా కుదిరిందని సినీ వర్గాలు అంటున్నాయి.



.jpg&w=3840&q=75)





.avif&w=3840&q=75)






కామెంట్స్ (3)
Exciting remake buzz
Excited to see Sreeleela as the new Jejamma!
సోను సూద్ మళ్లీ పశుపతిగా వస్తే — హిందీ వెర్షన్ కూడా బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ