

దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి పెళ్లి గురించి మరోసారి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా అఫైర్ల గురించి అనేక రూమర్లు వినిపించాయి. అయితే వాటిపై అనుష్క ఎప్పుడూ స్పందించలేదు. ఆమె మౌనం వల్ల ఆ వార్తలు కొంతకాలానికి తగ్గిపోయాయి. కానీ ఇటీవల ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని మరోసారి చర్చలు మొదలయ్యాయి.
మీడియా కథనాల ప్రకారం, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా ఈ ఏడాదిలోనే అనుష్క వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. కుటుంబానికి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తితో లేదా వ్యాపార రంగంలో స్థిరపడిన ఒక బిజినెస్‌మ్యాన్‌తో పెళ్లి జరిపించేందుకు కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అనుష్క లేదా ఆమె కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కెరీర్ విషయానికి వస్తే, అనుష్క ఇటీవల కాలంలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఘాటీ చిత్రాల్లో నటించారు. అలాగే మలయాళంలో కథనార్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా కొన్ని సినిమాల కథలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తున్నది.

















.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!