

మెగాస్టార్ చిరంజీవి కొడుకైన రామ్ చరణ్ తన తండ్రి పేరు నిలబెట్టుకునేలా టాలీవుడ్లో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ‘రంగస్థలం’ చిత్రంతో నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ గత సంవత్సరం వచ్చిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో, రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాడు. ఏప్రిల్ 30 న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక మరోవైపు, ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ హీరోల సరసన నిలిచాడు. 1850 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తర్వాత, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మరింత పెద్ద విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ ప్రస్తుతం రామ్ చరణ్ కంటే ముందుకు రావడానికి వ్యూహాత్మకంగా ప్రణాళికలు వేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన ఇప్పటికే మార్కెట్లో చరణ్ కంటే ముందంజలో ఉండి, తన పీఆర్ టీమ్ ద్వారా టాప్ హీరోగా ప్రమోషన్లు కూడా చేపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియకపోయినా, సోషల్ మీడియాలో ఈ వార్తలు వేగంగా వైరల్ అవుతున్నాయి.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!