
టెక్నాలజీ

వైట్ హౌస్ సమీపంలోని సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ వద్ద శనివారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా అధికారులు గుర్తించారు. అతని మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల సమాచారం ప్రకారం, నసీర్ బెస్ట్ తాను యేసుక్రీస్తు మరో అవతారమని నమ్మినట్లు భావిస్తున్నారు. గతంలోనే అతడిని వైట్ హౌస్ ప్రాంతానికి రాకుండా కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి అక్కడికి వచ్చిన అతను కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరిపారు. అనంతరం అతను ఆసుపత్రిలో మరణించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!