
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన అత్యంత విషాదకరమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎంపీ ఎం. భరత్‌తో కలిసి సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన కార్మికులను పరామర్శించిన కుమారస్వామి, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన సహాయం అందిస్తామని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!