
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమకు అత్యంత క్లిష్టమైన సమస్య అని పేర్కొన్నారు. తైవాన్ చైనాకు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉండగా, అమెరికాకు 15 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉందని తెలిపారు. భౌగోళిక దూరం కారణంగా తాము వేగంగా స్పందించడం కష్టమవుతుందని చెప్పారు.
చైనా శక్తివంతమైన దేశమని, తైవాన్–చైనా ఉద్రిక్తతల విషయంలో ఇరుపక్షాలు సంయమనం పాటించాలన్నారు. తైవాన్ స్వాతంత్ర్యం కోసం అంతదూరం వెళ్లి యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని ట్రంప్ స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!