

కేరళలోని కోజికోడ్‌లో అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రబ్బీ షేక్, రోష్నారా బేగం, పాపిజా (యా)గా గుర్తించారు. వారి వద్ద నుంచి నకిలీ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా తలెత్తిన వివాదంపై విచారణ చేపట్టిన సమయంలో నిందితుల గుర్తింపు పత్రాలపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో వారు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం, ఈ ముగ్గురూ కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. అంతకుముందు కర్ణాటకలోని బెంగళూరులో కార్మికులుగా పనిచేసిన వారు, కొన్ని నెలల క్రితం కేరళకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ భారతీయ గుర్తింపు కార్డులు సృష్టించి, తప్పుడు పేర్లతో నివసిస్తున్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ నకిలీ పత్రాలను ఎవరు తయారు చేశారు? వాటి వెనుక ఏదైనా ముఠా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!