

రాష్ట్ర ఆర్థిక వనరులను పెంపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. కేబినెట్ ఆర్థిక వనరుల సమీకరణ ఉపసంఘం హైడ్రా పరిధిలోని భూములతో పాటు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న, న్యాయపరమైన వివాదాలు లేని ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ భూములను టీజీఐఐసీ (TGIIC), హెచ్‌ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో వేలం వేసి భారీ స్థాయిలో ఆదాయం సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
సమాచారం ప్రకారం, టీజీఐఐసీ మరియు హెచ్‌ఎండీఏలకు నెలవారీగా రూ.1,000 కోట్లు చొప్పున, మొత్తం రూ.2,000 కోట్ల ఆదాయం సమీకరించాలని కేబినెట్ ఉపసంఘం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టమని హెచ్‌ఎండీఏ అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ, ఉపసంఘం తన నిర్ణయాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!