
జనరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ రీల్‌ను మెటా తాత్కాలికంగా తొలగించిన ఘటనపై రాజకీయ, నియంత్రణ వర్గాల్లో చర్చ మొదలైంది. పార్లమెంటరీ స్థాయి కమిటీ చైర్మన్ నిశికాంత్ దూబే మాట్లాడుతూ, ఈ ఘటనపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి తప్పిదాలు పునరావృతమైతే ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద కంపెనీకి లభించే ‘సేఫ్ హార్బర్’ రక్షణపై ప్రభావం పడొచ్చని హెచ్చరించారు.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరిన నేపథ్యంలో మెటా, గూగుల్, యూట్యూబ్, ఎక్స్, స్నాప్‌చాట్ ప్రతినిధులతో పాటు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఘటన సోషల్ మీడియా వేదికల కంటెంట్ మోడరేషన్ విధానాలు, వాటి బాధ్యతలపై మరోసారి చర్చకు దారితీసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!