
గాసిప్స్

ఆర్ ప్రజ్ఞానంద నార్వే చెస్-2026 టోర్నీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచిన ప్రజ్ఞానందపై చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ ప్రశంసల వర్షం కురిపించారు. వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్స్‌లో విజయం సాధించడం సాధారణ విషయం కాదని, ప్రజ్ఞానంద అద్భుతమైన పోరాట యోధుడని కార్ల్‌సన్ కొనియాడారు.
ఈ టోర్నీలో ప్రజ్ఞానంద చేతిలో రెండు సార్లు ఓడిన కార్ల్‌సన్, అతడి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు ప్రజ్ఞానంద మాట్లాడుతూ, టోర్నీని కాస్త నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ చివరకు ఛాంపియన్‌గా నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా కార్ల్‌సన్‌పై విజయం సాధించి, ఆయన సమక్షంలోనే ట్రోఫీని అందుకోవడం తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేక క్షణమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!