

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పూనేత విడుదల చేశారు. రాష్ట్రంలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈరోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 10 పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, 30న ఫలితాలు ప్రకటించనున్నారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 5న ఫలితాలు విడుదల చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశ నవంబర్ 26న, రెండో దశ నవంబర్ 29న, మూడో దశ డిసెంబర్ 2న జరగనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను పోలింగ్ జరిగిన రోజే ప్రకటించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!