

ఖమ్మానికి చెందిన యువ పర్వతారోహకుడు మోతికుమార్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను విజయవంతంగా చేరుకొని అరుదైన ఘనత సాధించారు. సముద్ర మట్టానికి సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి సంస్థ జెండాను ప్రదర్శించి తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మోతికుమార్‌ను అభినందిస్తూ ఆయన సాహసస్ఫూర్తిని కొనియాడారు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద సింగరేణి జెండాతో దిగిన ఫొటోను మోతికుమార్ డిప్యూటీ సీఎంకు బహుకరించారు. గతంలో కిలిమంజారో, ఎల్‌బ్రస్ వంటి అంతర్జాతీయ శిఖరాలను అధిరోహించిన వివరాలను కూడా ఆయన వివరించారు. ప్రపంచంలోనే అత్యున్నత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడమే తన తదుపరి లక్ష్యమని, అందుకోసం కఠిన సాధన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!