

కేరళకు చెందిన ఓ వస్త్రాల షోరూం యజమాని తీసుకున్న వినూత్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. సాధారణంగా పెద్ద షోరూంలు తమ ప్రచార కార్యక్రమాల కోసం సినీ తారలు లేదా ప్రొఫెషనల్ మోడల్స్‌ను ఎంపిక చేస్తుంటాయి. అయితే ఈ యజమాని మాత్రం ఖరీదైన మోడల్స్ వెనుక వెళ్లకుండా, తన షోరూంలో పనిచేసే సేల్స్ గర్ల్స్కే మోడలింగ్ చేసే అవకాశం కల్పించారు.
ప్రతిరోజూ కస్టమర్లకు చీరలు చూపించే సిబ్బంది వాటిని ధరించి ప్రకటనల్లో కనిపించడం వినియోగదారులకు మరింత సహజంగా, ఆత్మీయంగా అనిపించింది. షోరూం బయట ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల్లో సేల్స్ గర్ల్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ ఉద్యోగులకు ఇంతటి గౌరవం, గుర్తింపు ఇచ్చిన యజమానిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఆలోచనతో ప్రచార ఖర్చులు తగ్గడమే కాకుండా, సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెరిగి వ్యాపారానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!