

హైదరాబాద్లో నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ను అరికట్టడంతో పాటు అనుమానాస్పద వాహనాలపై నిఘా పెంచేందుకు పోలీసులు అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో 100 బృందాలు, సుమారు 3,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొని నగరవ్యాప్తంగా విస్తృతంగా నాకాబందీ చేపట్టారు. వాహనాల నంబర్ ప్లేట్లలో మార్పులు, నిబంధనల ఉల్లంఘనలు, అనుమానాస్పద కదలికలను గుర్తించడంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.
ఈ ఆపరేషన్లో మొత్తం 725 వాహనాలను పోలీసులు డిటైన్ చేయగా, 48 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీస్ కమిషనర్ సజ్జనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీలను పరిశీలించారు. నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, ఇతర అక్రమ కార్యకలాపాలను నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్నవారిపై తదుపరి విచారణ, డిటైన్ చేసిన వాహనాలపై చట్టపరమైన చర్యలు సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం కొనసాగనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!