
జనరల్

ప్రపంచవ్యాప్తంగా వేడి సంబంధిత ఆరోగ్య ముప్పు ఎక్కువగా ఉన్న 30 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. 205 నగరాలపై చేపట్టిన ఈ పరిశోధనలో హైదరాబాద్ హీట్ వల్నరబిలిటీ ఇండెక్స్‌లో 0.68 స్కోరు నమోదు చేసింది. వేగవంతమైన పట్టణీకరణ, పచ్చదనం తగ్గిపోవడం, ఎయిర్ కండిషనర్ల వినియోగం పెరగడం వంటి అంశాలు వేడి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని అధ్యయనం పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 5 వరకు హైదరాబాద్‌లో 47 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదయ్యాయి. గత పదేళ్లలో ఇదే అత్యధిక సంఖ్యగా గుర్తించారు. భవిష్యత్తులో వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు పచ్చదనం పెంపు, సమర్థవంతమైన పట్టణ ప్రణాళిక అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!