
సినిమాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై నెమ్మదిగా కనిపించడం ప్రారంభమైంది. ఇప్పటికే ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే దీపావళి పండుగ సమయానికి సామాన్యులపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మార్కెట్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే రెపో రేటుతో అనుసంధానమై ఉన్న హోమ్ లోన్లు, వెహికిల్ లోన్లు, పర్సనల్ లోన్ల ఈఎంఐలు భారీగా పెరిగి మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!