

విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల దుర్వినియోగానికి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై FIITJEE Ltd, సంస్థ డైరెక్టర్లు దినేశ్ కుమార్ గోయల్, మోనిలా గోయల్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. JEE వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం నిర్వహించే కోచింగ్ కార్యక్రమాలకు సంబంధించి ఈ ఫిర్యాదు నమోదైంది. విద్యార్థుల నుంచి ముందుగానే భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసిన వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.
ఈడీ ఆరోపణల ప్రకారం, రెండు నుంచి నాలుగేళ్ల కోచింగ్ కార్యక్రమాలకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.2.8 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ముందస్తుగా వసూలు చేశారు. పూర్తి కోచింగ్ అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, జీతాలు చెల్లించకపోవడంతో అధ్యాపకులు సంస్థను వీడారని, అనంతరం కొన్ని కోచింగ్ కేంద్రాలను ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా మూసివేశారని ఈడీ పేర్కొంది. ఈ పరిణామాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో న్యాయపరమైన విచారణ కొనసాగనుంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!