
రాజకీయాలు

తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక శిబిరాలను నిర్వహించనుంది. ఎల్లుండి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ శిబిరాలు కొనసాగనున్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో క్యాంపులను ఏర్పాటు చేసి, అర్హులైన పౌరులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
ముఖ్యంగా తొలిసారి ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఓటరు జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు అర్హులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు ఈ శిబిరాల ద్వారా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!