
క్రీడలు

మలక్‌పేటలో వాహన తనిఖీల సందర్భంగా జింక మాంసంతో పట్టుబడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సయ్యద్ హుస్సేన్, సయ్యద్ ఒమర్, మహ్మద్ హమీద్‌గా గుర్తించారు. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనంలో జింక మాంసంతో పాటు రైఫిల్, ఎనిమిది బుల్లెట్లు, 12 ఖాళీ కార్ట్రిడ్జ్లు, రెండు నైట్ విజన్ టెలిస్కోప్‌లు, బ్యాటరీ, నాలుగు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో భాగంగా నిందితులు కర్ణాటకలోని కలబురగి జిల్లా అటవీ ప్రాంతానికి జింకల వేట కోసం వెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం. ముగ్గురూ కలిసి 12 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించినట్లు తెలుస్తోంది. స్కార్పియో వాహనంతో పాటు తుపాకీ, బుల్లెట్లు, ఇతర సామగ్రిని అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!