

సైబరాబాద్ పోలీసులు జ్యోతిష్యం, తంత్ర సేవల పేరుతో జరుగుతున్న కొత్త తరహా సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ టి. సాయిమనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార నష్టాలు, వశీకరణ వంటి అంశాలను పరిష్కరిస్తామని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. మొదట చిన్న మొత్తాల్లో డబ్బు తీసుకుని నమ్మకం కలిగించిన తర్వాత పూజలు, తంత్రాలు పేరుతో భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాల ద్వారా బాధితుల వ్యక్తిగత వివరాలు సేకరించి, ఆ తర్వాత బెదిరింపులకు దిగుతున్నారని పోలీసులు హెచ్చరించారు. డబ్బు చెల్లించకపోతే కుటుంబ సభ్యులకు హాని చేస్తామని, వ్యక్తిగత సమాచారం బయటపెడతామని భయపెడుతున్నట్లు వెల్లడించారు. పరిచయం లేని వ్యక్తులకు డబ్బు పంపకూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని పోలీసులు సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!