

బిగ్బాస్ తెలుగు 8తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రేరణ కంభం ఇటీవల అభిమానులతో శుభవార్త పంచుకుంది. తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన భర్త శ్రీపాద్తో కలిసి బేబీ బంప్ చూపిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయగా, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ప్రేరణ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ప్రత్యేక వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘రణబాలి’ సినిమాలో రష్మిక మందన్న పోషించిన జయమ్మ పాత్రకు సంబంధించిన ‘ఏందయ్యా సామీ’ పాటను ఈ వీడియోకు జోడించింది. దీంతో ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
కర్ణాటకకు చెందిన ప్రేరణ, నటిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న సమయంలో రష్మిక మందన్నకు స్నేహితురాలిగా ఉండేది. అనంతరం రష్మిక సినిమాల్లో హీరోయిన్గా ఎదగగా, ప్రేరణ టెలివిజన్ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ‘కృష్ణ ముకుంద మురారీ’ సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత బిగ్బాస్ తెలుగు 8వ సీజన్లో పాల్గొని ఫినాలే వరకు చేరింది. అయితే టాప్ 4తోనే ఆమె ప్రయాణం ముగిసింది. అనంతరం భర్త శ్రీపాద్తో కలిసి ఓంకార్ హోస్ట్ చేసిన ‘ఇస్మార్ట్ జోడీ 3’ రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. ఈ జంట 2023 నవంబర్లో వివాహం చేసుకుంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!