
షోస్

హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు దంపతులను సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మర్యాదపూర్వకంగా కలిశారు. వివాహం అనంతరం తొలి దసరా పండుగను తెలంగాణలో జరుపుకుంటున్న రష్మికకు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక స్వాగతం పలికారు.
దసరా పండుగ సందర్భంగా రష్మిక మందన్నకు ప్రత్యేక బతుకమ్మ చీరను కానుకగా అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఆయన సతీమణి నందిని ఈ కానుకను అందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ చీరను పండుగ కానుకగా అందించడం ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!