

భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఒప్పందం ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య పరిస్థితులు, ద్వైపాక్షిక ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్చలను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆమె వెల్లడించారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో మాట్లాడిన సీతారామన్.. అమెరికాతో చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు.
వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన తొలి దశ ఖరారైందని, ప్రస్తుతం దానికి చట్టపరమైన ముసాయిదా రూపొందిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తనకు తెలిపారని సీతారామన్ వివరించారు. త్వరలోనే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని ఆమె అన్నారు. కొవిడ్ తర్వాతి నాలుగైదేళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొంటూ, సమ్మిళిత వృద్ధి విధానాలు, నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు, ఆర్థిక క్రమశిక్షణ ఈ పురోగతికి ప్రధాన కారణాలని వివరించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!