

షాపింగ్ మాల్స్ మరియు చిల్లర దుకాణాల్లో బిల్లింగ్ సమయంలో వినియోగదారుల మొబైల్ నంబర్ అడగడం సాధారణంగా మారింది. అయితే, వ్యక్తిగత మొబైల్ నంబర్ ఇవ్వడం వినియోగదారులకు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశాన్ని లోక్‌సభలో ఎంపీ జనార్థన్ సింగ్ సిగ్రివాల్ ప్రస్తావించగా కేంద్రం సమాధానం ఇచ్చింది.
2023 మే 26 న రిటైలర్ల సంఘాల ద్వారా సూచనలు జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది. వినియోగదారుల అభీష్టం మేరకే మొబైల్ నంబర్ సేకరించాలనీ, నంబర్ ఇవ్వాలని ఎటువంటి నిబంధన లేదని స్పష్టం చేసింది. వినియోగదారులు తమ నంబర్ వెల్లడించేందుకు నిరాకరించే హక్కు కలిగి ఉన్నారు.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 మరియు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 ప్రకారం పౌరుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా రక్షణ కల్పించాలి. ఒకవేళ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం జరిగితే కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చని కేంద్రం తెలిపింది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!