

ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన చాట్‌జీపీటీ యాప్‌పై మరోసారి వివాదం చెలరేగింది. అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టుల్లో ఓపెన్ఏఐపై మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. వీటిలో నాలుగు ఆత్మహత్య కేసులు, మిగిలిన మూడు మానసిక సమస్యలకు సంబంధించినవి అని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ కేసుల్లో ఒకదాంట్లో జార్జియాకు చెందిన 17 ఏళ్ల అమ్మౌరీ లేసీ అనే యువకుడు ఆత్మహత్యకు ముందు నెలరోజులు చాట్‌జీపీటీతో మాట్లాడినట్లు ఆరోపించారు. మరో కేసులో ఫ్లోరిడాకు చెందిన 26 ఏళ్ల జోషువా ఎన్నేకింగ్ తల్లి, తన కుమారుడు ఆత్మహత్య యత్నాలను ఎలా దాచుకోవాలో చాట్‌జీపీటీని అడిగాడని తెలిపింది.
టెక్సాస్‌కు చెందిన జేన్ షాంబ్లిన్ (23), ఒరెగాన్కు చెందిన జో సెచ్చాంటీ (48) మరణాలకూ చాట్‌జీపీటీ కారణమని వారి కుటుంబాలు కోర్టులో పేర్కొన్నాయి. ఇతర మూడు కేసులు మానసిక ఒత్తిడి, భ్రాంతులు ఎదుర్కొన్న వ్యక్తులు దాఖలు చేశారు. హన్నన్ మ్యాడెన్ (32), జేకబ్ ఇర్విన్ (30) మానసిక వైద్య సహాయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. కెనడాకు చెందిన అలెన్ బ్రూక్స్ (48) భ్రాంతులతో బాధపడి ఉద్యోగం నుండి తాత్కాలిక విరామం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఇందుకు స్పందించిన ఓపెన్ఏఐ ప్రతినిధి, “ఈ ఘటనలు చాలా బాధాకరమైనవి. మేము చాట్‌జీపీటీని మానసిక ఒత్తిడిని గుర్తించి, వినియోగదారులను వాస్తవ సహాయ వనరుల వైపు దారితీసే విధంగా మెరుగుపరుస్తున్నాం” అని తెలిపారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!