

నోయిడాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Lava International తన కొత్త స్మార్ట్‌ఫోన్ Bold N2 ను ఈ వారం భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17 న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ కానుంది. “Be Fearless, Be Bold” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఫోన్‌ను పరిచయం చేయనున్నారు.
ఈ ఫోన్ దేశంలో ప్రత్యేకంగా Amazon ద్వారా మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉండనుంది. గ్రే, బ్లాక్ రంగుల్లో విడుదల కానున్న ఈ మోడల్‌కు ప్రత్యేక మైక్రోసైట్ ఇప్పటికే లైవ్‌లోకి వచ్చింది. ఫోన్ డిజైన్‌లో ఫ్లాట్ రియర్ ప్యానెల్, మెటల్ ఫ్రేమ్, సైడ్‌లో పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
Bold N2 లో స్క్వేర్ మాడ్యూల్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. USB Type C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, బాటమ్ స్పీకర్ గ్రిల్ వంటి ఫీచర్లు కూడా అందించనున్నారు. ఈ ఫోన్ గత సంవత్సరం విడుదలైన Bold N1 కి సక్సెసర్‌గా వస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!