

గూగుల్ తన Translate యాప్‌కు పెద్ద అప్డేట్ను ప్రకటించింది. ఇందులో ఆధునిక Gemini AI టెక్నాలజీని జోడించడం ద్వారా అనువాదాలు మరింత సహజంగా, ఖచ్చితంగా ఉండేలా చేసింది. ఈ అప్డేట్తో వాక్యాల భావం, నుడుకులు, సామెతలు, స్థానిక పదప్రయోగాలను కూడా సరిగ్గా అర్థం చేసుకుని అనువదించగలుగుతుంది. ఈ మెరుగైన అనువాదాలు గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌తో పాటు గూగుల్ సెర్చ్‌లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
ఇక మరో ముఖ్యమైన ఫీచర్‌గా హెడ్‌ఫోన్స్ ద్వారా లైవ్ ట్రాన్స్‌లేషన్‌ను గూగుల్ పరిచయం చేసింది. జెమినీ AI ఆధారంగా పనిచేసే ఈ బీటా ఫీచర్ ద్వారా రియల్ టైమ్‌లో మాటలను మరో భాషలోకి సహజంగా వినిపించవచ్చు. టోన్, ఉచ్చారణ, భావం మారకుండా అనువాదం వినిపించడం దీని ప్రత్యేకత. విదేశీ ప్రయాణాలు, ఇతర భాషల్లో మాట్లాడే వారితో సంభాషణలు, లెక్చర్లు వినడం వంటి వాటికి ఇది ఎంతో ఉపయోగకరం.
ప్రస్తుతం ఈ జెమినీ AI అప్డేట్ అమెరికా, భారత్‌లో విడుదల అవుతోంది. ఇంగ్లిష్తో పాటు హిందీ, స్పానిష్, చైనీస్, జపనీస్, జర్మన్ సహా సుమారు 20 భాషలకు మద్దతు ఉంది. లైవ్ హెడ్‌ఫోన్ ట్రాన్స్లేషన్ ఫీచర్ ఆండ్రాయిడ్‌లో బీటా దశలో అందుబాటులో ఉండగా, 70కిపైగా భాషలను సపోర్ట్ చేస్తోంది. 2026 నాటికి ఈ ఫీచర్‌ను ఐఫోన్లకు, మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్లు గూగుల్ తెలిపింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!