

యాపిల్ సంస్థ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2025) జూన్ 9 నుంచి 13 వరకు కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ పార్క్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ కార్యక్రమం రాత్రి 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌ను యాపిల్ యూట్యూబ్ ఛానల్, యాపిల్ అధికారిక వెబ్సైట్, యాపిల్ టీవీ యాప్ ద్వారా లైవ్‌గా ఉచితంగా వీక్షించవచ్చు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కీనోట్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఇతర డివైజ్‌లకు సంబంధించిన తాజా సాఫ్ట్వేర్ అప్డేట్స్ను ప్రకటించనున్నారు.
ఈసారి WWDC 2025 వేదికగా పలు కొత్త అప్డేట్స్ వెలువడే అవకాశం ఉంది. వాటిలో iOS 26, iPadOS 26, macOS Tahoe, visionOS 26, watchOS 26 వంటి అప్డేట్స్తో పాటు ‘హోమ్ఓఎస్’ పేరుతో స్మార్ట్ హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పరిచయం చేయవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. యాపిల్ డెవలపర్లకు తమ యాప్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను చేర్చేందుకు ఫౌండేషన్ మోడళ్ల యాక్సెస్ ఇవ్వవచ్చని సమాచారం. అలాగే బ్యాటరీ ఆప్టిమైజేషన్, సిరి అప్డేట్స్, విజన్ ప్రో ఐ స్క్రోలింగ్, కంట్రోలర్ సపోర్ట్ వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.











కామెంట్స్ (2)
WWDC 2025 కోసం టెక్ ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తోంది!
WWDC 2025 is set to unveil Apple’s next big innovations.