
గాసిప్స్

వెస్టిండీస్ జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 లో అద్భుత ప్రదర్శనతో సూపర్ 8 దశకు అర్హత సాధించింది. గ్రూప్ దశలో వరుస విజయాలతో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. మొదట స్కాట్లాండ్పై 35 పరుగుల తేడాతో విజయం సాధించిన విండీస్, తర్వాత ఇంగ్లాండ్‌పై 30 పరుగులతో గెలిచింది. అనంతరం నేపాల్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు నమోదు చేసింది.
ఈ వరుస విజయాలతో వెస్టిండీస్ జట్టు టోర్నీలో బలమైన పోటీదారుగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శనతో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఇప్పటివరకు అజేయంగా కొనసాగుతున్న ఈ జట్టు సూపర్ 8 లో కూడా ఇదే జోరు కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!