

స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ శనివారం టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫెడరర్ భావోద్వేగానికి గురయ్యారు. తన కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకోవడానికి చేసిన కృషిని గుర్తు చేసుకున్న ఆయన.. తనకు అండగా నిలిచిన వ్యక్తులు, ప్రోత్సహించినవారు, తనను తీర్చిదిద్దిన కోచ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తన టెన్నిస్ ప్రయాణంలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
హాల్ ఆఫ్ ఫేమ్‌లో ప్రవేశించడం తనకు ఎంతో గొప్ప సందర్భమని ఫెడరర్ అన్నారు. ఈ వేదికపై నిలబడటం అద్భుతమైన అనుభూతిగా ఉందని, తన కెరీర్‌కు ఈ గౌరవంతో సంపూర్ణత లభించిందని తెలిపారు. అంతకుముందు ఫెడరర్ భార్య మిర్కా సభికులకు ఆయనను పరిచయం చేశారు. అనంతరం వేదికపైకి వచ్చిన ఫెడరర్ ఆమెను ఆప్యాయంగా హత్తుకుని, ఇంత బాగా మాట్లాడగలదని ఇప్పుడే తెలిసిందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో కార్యక్రమంలో భావోద్వేగంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!