

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–500 సిరీస్‌లో భాగమైన ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సింధు, థాయ్‌లాండ్‌కు చెందిన టాప్ సీడ్, మాజీ ప్రపంచ చాంపియన్ రచనోక్ ఇంతనోన్ చేతిలో ఓటమిపాలైంది. 62 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇంతనోన్ తొలి గేమ్‌ను 21–11తో గెలుచుకుంది. అయితే సింధు పుంజుకుని రెండో గేమ్‌ను 21–19తో కైవసం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది.
చివరి గేమ్‌లో రచనోక్ ఇంతనోన్ పైచేయి సాధించి 21–18తో గెలిచింది. దీంతో సింధుపై తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు జరిగిన పోటీల్లో ఇంతనోన్ 11 సార్లు విజయం సాధించగా, సింధు నాలుగు విజయాలు నమోదు చేసింది. మరోవైపు పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత జోడీ గరగ కృష్ణప్రసాద్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ 13–21, 14–21తో డెన్మార్క్‌కు చెందిన క్రిస్టియాన్ ఫాస్ట్–రాస్మస్ జోడీ చేతిలో ఓడిపోయింది. దీంతో ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత ఆటగాళ్ల పోరు ముగిసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!