
-1762340580370_d.webp&w=3840&q=75)
చిత్రం: జటాధర
సమయం: 2 గంటల 10 నిమిషాలు (సుమారు)
తరహా: హారర్ థ్రిల్లర్
రిలీజ్ తేదీ: నవంబర్ 7, 2025
నటీనటులు: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా (ప్రత్యేక పాత్ర), శిల్పా శిరోధ్కర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, శ్రీనివాస్ అవసరాల తదితరులు
నిర్మాతలు: ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా
బ్యానర్: జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా ప్రొడక్షన్స్
సంగీతం: అజయ్ ఠాకూర్
శీర్షిక: ‘జటాధర’ – భక్తి, భయం కలబోతగా ఉన్న గందరగోళ థ్రిల్లర్
కథ ఏంటి:
శివ (సుధీర్ బాబు) భూతాల ఫుటేజ్ దొరకాలని ప్రయత్నిస్తుంటాడు కానీ ప్రతిసారి విఫలమవుతాడు. ఒక రోజు తన తల్లిదండ్రులు దత్తత తల్లిదండ్రులేనని తెలిసి షాక్ అవుతాడు. ఆ నిజం వెనుక ఉన్న రహస్యం రుద్రారం గ్రామంతో సంబంధం ఉన్నదని తెలుసుకుంటాడు. తన జననం, దానపిశాచి మధ్య ఉన్న అనుబంధం తెలుసుకునే క్రమంలో అతని జీవితం తలకిందులవుతుంది.
రివ్యూ:
పాజిటివ్స్:
సుధీర్ బాబు చేసిన తాండవ సీక్వెన్స్‌లో కొంత హైప్నాటిక్ ఫీలింగ్ ఉంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. కథలో భక్తి, హారర్ మిళితం చేసే ఆలోచన బాగానే ఉంది.
నెగిటివ్స్:
స్క్రీన్‌ప్లే లోతు లేకుండా సాగుతుంది. కథలో లాజిక్ కనపడదు. ప్రేమ ట్రాక్ చాలా తడబడింది. దర్శకత్వం చిన్న షార్ట్‌ఫిల్మ్ స్థాయిలో ఉంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ అన్ని విఫలమయ్యాయి. సుధీర్ బాబు నటనకు కూడా సరైన స్కోప్ ఇవ్వలేదు.
ముగింపు:
జటాధర మంచి కాన్సెప్ట్ ఉన్నా దాన్ని నడిపిన విధానం బలహీనంగా ఉంది. భక్తి, భయం కలయికగా చెప్పిన ఈ కథ ప్రేక్షకులలో ఏ భావనను రేకెత్తించలేకపోయింది.
మా రేటింగ్: 1.5/5










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!