

విడుదల తేదీ: డిసెంబర్ 12, 2025
నటీనటులు: ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీష్ యోహన్ కురువిల్ల
దర్శకుడు: జెనూస్ మొహమ్మద్
నిర్మాత: వి. ఆనంద ప్రసాద్
సంగీతం: ఓషో వెంకట్
‘అఖండ 2’లో విలన్‌గా మెప్పించిన ఆది పినిశెట్టి, డ్రైవ్ సినిమాతో హీరోగా వచ్చాడు. కానీ థ్రిల్లర్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన ఉత్కంఠను అందించలేకపోయింది.
మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించిన జయదేవ్ రెడ్డి (ఆది పినిశెట్టి) ఒక జాతీయవాద సంస్థతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంటాడు. కుటుంబంతో కలిసి లండన్‌కు వెళ్లాలని భావిస్తున్న సమయంలో, ఓ హ్యాకర్ ఆ ఒప్పందాన్ని బహిర్గతం చేస్తాడు.
అంతేకాదు, జయదేవ్‌కు అత్యంత సన్నిహితులపై కూడా దాడులు మొదలవుతాయి.
ఆ హ్యాకర్ ఎవరు?
జయదేవ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు?
ఈ పోరాటం ఎలా ముగుస్తుంది?
అన్నదే కథా సారాంశం.
ఆది పినిశెట్టి నటన పరవాలేదనిపించినా, స్క్రిప్ట్ బలహీనంగా ఉండటం వల్ల అతడి ప్రతిభ వృథా అయినట్టే అనిపిస్తుంది.
క్లైమాక్స్‌లో సత్యదేవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. అతడి పాత్ర సీక్వెల్‌కు సూచన ఇస్తుంది.
మడోన్నా సెబాస్టియన్ పాత్ర కథకు పెద్దగా ఉపయోగపడదు. ఆమె సీరియస్ సన్నివేశాల్లో చేసే ప్రశ్నలు ఉత్కంఠను తగ్గిస్తాయి.
కొన్ని విజువల్స్ ఆకట్టుకుంటాయి
సినిమాటోగ్రఫీ బాగుంది
క్లైమాక్స్‌లో సత్యదేవ్ పాత్ర
రివెంజ్ డ్రామాకు కావాల్సిన టెన్షన్ లేకపోవడం
హ్యాకర్ పాత్ర ఉద్దేశ్యం స్పష్టంగా చెప్పకపోవడం
అనేక లాజిక్ లోపాలు
కథ చాలా రొటీన్‌గా సాగడం
ద్వితీయార్థం నెమ్మదిగా మారడం
హ్యాకర్‌ను అత్యంత శక్తివంతుడిగా చూపించినా, కథ అతడిని పరిమితంగా ఉపయోగించుకోవడం వల్ల ప్రభావం తగ్గింది.
దర్శకుడు జెనూస్ మొహమ్మద్ కథనంలో వేగం, ఉత్కంఠ, భావోద్వేగాలను నిలబెట్టలేకపోయారు. రచనలో డెప్త్ లోపించింది.
ఓషో వెంకట్ సంగీతం పెద్దగా మెప్పించదు. ఎడిటింగ్ సరైన స్థాయిలో ఉన్నా, ద్వితీయార్థం నెమ్మదిస్తుంది. నిర్మాణ విలువలు సరిపడినంత ఉన్నాయి.
మొత్తానికి డ్రైవ్ కొత్తదనం లేని, ఫ్లాట్‌గా సాగే రివెంజ్ థ్రిల్లర్. బలమైన కథ, మెరుగైన డైరెక్షన్ ఉంటే ఇది మంచి సినిమాగా మారేదేమో. సీరియస్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని స్కిప్ చేయడం మంచిది.
రేటింగ్: 2/5











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!