

విడుదల తేదీ: డిసెంబర్ 25, 2025
నటీనటులు: శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి తదితరులు
దర్శకుడు: మురళీకాంత్ దేవాసోత్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రాఫర్: వెంకట్ ఆర్ శాకమూరి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
2004 నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. రైతు శివాజీ తన కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన రవి తాను కన్నా పైకులానికి చెందిన సుజాతను ప్రేమిస్తాడు. ఈ ప్రేమే తీవ్ర సంఘర్షణలకు దారి తీస్తుంది. కుల గర్వం, సామాజిక అణచివేత కారణంగా శివాజీ తీసుకున్న దారుణ నిర్ణయాలే కథకు ప్రధాన బలం.
• కుల వివక్ష అంశాన్ని కొత్త కోణంలో చూపించిన విధానం
• శివాజీ, నవదీప్ ల పవర్ఫుల్ నటన
• కోర్ట్ డ్రామా మరియు క్లైమాక్స్ సన్నివేశాలు
• సహజమైన కథనం, నిజానికి దగ్గరగా ఉన్న ట్రీట్మెంట్
• ఫస్ట్ హాఫ్‌లో కథనం కొంత అస్పష్టంగా అనిపించడం
• కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించడం
• కొన్ని పాత్రల మధ్య సంబంధాలు ఇంకా స్పష్టంగా చూపాల్సింది
గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ డిజైన్ బాగా కుదిరింది. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకు బలం. వెంకట్ శాకమూరి కెమెరా వర్క్ సహజంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది.
దండోరా కులాల నేపథ్యంతో వచ్చిన సినిమాల్లో ఒక ప్రత్యేక ప్రయత్నం. చిన్న లోపాలు ఉన్నప్పటికీ, నిజాయితీతో చెప్పిన కథ, బలమైన నటనలతో ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రం ఇది.
రేటింగ్: 3 / 5











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!