
రాజకీయాలు

బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడంలో తన పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. రెడ్డి సామాజిక వర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి తప్ప మరెవ్వరూ పవర్ఫుల్ నాయకుడు లేరని తానే చెప్పానని తెలిపారు. ఎవరు ఏం అనుకున్నా తాను మరియు రేవంత్ రెడ్డి అన్నదమ్ములమని అన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలో విలన్ పాత్ర చేయమని దర్శకుడు హరీష్ శంకర్ అడిగినా తాను అంగీకరించలేదని తెలిపారు. భవిష్యత్తులో సినిమాల్లో నటించాలని, ముఖ్యంగా ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఆసక్తి వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం తాను సినిమాల్లోకి వస్తే విలన్ పాత్రలకే సరిపోతారని సూచించినట్లు తెలిపారు.











.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!