
న్యూస్

సుధీర్‌బాబు హీరోగా చేసిన సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ జటాధర అకస్మాత్తుగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. థియేటర్లలో భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా దెబ్బతిని, రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినా రూ. 5 కోట్లు మాత్రమే రాబట్టింది. సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా, ధన పిశాచి నేపథ్యంలో జరిగిన మిస్టీరియస్ సంఘటనలను చూపిస్తూ సాగుతుంది.
ఇక మరోవైపు, మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ చిత్రం డీయస్ ఈరే కూడా అదే రోజు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై మంచి స్పందనతో రూ. 80 కోట్ల వసూళ్లు సాధించింది. హారర్ మూవీస్ ఇష్టపడేవారికి రెండు చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో డబుల్ ట్రీట్లాంటివి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!