

బాలనటుడిగా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మహేంద్రన్.. పెద్దయ్యాక 'మాస్టర్' తదితర తమిళ చిత్రాల్లోనూ నటించాడు. ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశాడు. అలా చేసిన ఓ మూవీ 'నీలకంఠ'. ఈ నెల 2వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న స్టార్స్ లేకపోవడంతో ఎప్పుడొచ్చి వెళ్లిందో అన్నంత వేగంగా మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం వచ్చే నెల 6వ తేదీ నుంచి సన్ నెక్స్ట్లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికి వస్తే, సరస్వతిపురం అనే గ్రామంలో జరిగే సంఘటనలే కథాంశం. ఊరిలో ఎవరూ తప్పు చేసినా గ్రామపెద్ద రాఘవయ్య(రాంకీ) కఠిన శిక్షలు విధిస్తుంటాడు. ఇదే ఊరికి చెందిన టైలర్ నాగభూషణం(కంచరపాలెం రాజు) కొడుకు.. పదో క్లాసు చదువుతున్న ఓ తప్పు చేస్తాడు. దీనికి శిక్షగా 15 ఏళ్లపాటు ఊరి దాటి వెళ్లొద్దని రాఘవయ్య ఆదేశిస్తాడు. ఈ కారణం వల్ల నీలకంఠ పెద్ద చదువులు చదవలేకపోతాడు. కబడ్డీ ప్లేయర్ అవుతాడు గానీ శిక్ష వల్ల మండల స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్లలేకపోతాడు. మరోవైపు ఇదే ఊరి సర్పంచ్(పృథ్వీ) కూతురు సీత(యష్న ముతులూరి)తో నీలకంఠ ప్రేమలో ఉంటాడు. ఓ సందర్భంగా సీత తండ్రితోనే సర్పంచ్ అవుతానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. చివరకు ఏమైందనేదే మిగతా కథ.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!