

కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్’ గతేడాదిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదలైంది. నవీన్ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్ వంటి ప్రముఖులు కూడా సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. క్రిస్మస్ సమయాన కొన్ని తెలుగు సినిమాలు భారీగా విడుదల కావడంతో, థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనకు కొరత ఏర్పడింది. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రతిస్పందన పొందింది.
మార్క్(Mark) సినిమా ఈ నెల 23 న జియోహాట్‌స్టార్ (JioHotstar)లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్‌లలో తన నటన హైలైట్ అని రివ్యూలు వచ్చాయి. యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నాయన్నారు. కథ చాలా బలహీనంగా ఉండటం.. ఆపై ఊహించదగిన ట్విస్టులతో కాస్త నిరాశపరిచిందని విమర్శలు వచ్చాయి.యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని ఈ సినిమా పూర్తిగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!