

నందమూరి బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం అఖండ 2 థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, బాలయ్య–బోయపాటి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 12 న విడుద లై బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. హిందుత్వం, సనాతన ధర్మం నేపథ్యంగా సాగిన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు టాక్.
ఈ చిత్రంలో బాలయ్య హీరోగా మెరిసితే, సంయుక్త మీనన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి తన నటనతో ఆకట్టుకున్నారు. వాణిజ్యంగా కూడా సినిమా మంచి ఫలితాన్ని అందుకుని రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం.
ఇప్పుడీ సినిమా పై మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని అఖండ 2 ను ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనవరి 9 వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్కు తీసుకురావాలనే యోచనలో ఉన్నారట. దీని పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.



.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!