
టెక్నాలజీ

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రూ. 430 కోట్లతో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓవరాల్ గా రూ. 2300 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
ఓటీటీలకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లిష్.. ఇలా అన్ని భాషల్లోనూ ఈ జానర్ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక హారర్ థ్రిల్లర్ సినిమానే. హాలీవుడ్ లో ఉన్న పలు పాపులర్ ఫ్రాంచైజ్, సిరీస్ లలో ఇది కూడా ఒకటి. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో మొత్తం ఐదు సినిమాలు రిలీజయ్యాయి. అన్ని సినిమాలు బ్లాక బస్టర్స్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించాయి. ఇండియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు కూడా ఈ ఫ్రాంచైజీ సినిమాలను ఎగబడి చూస్తారు. అలాంటి పాపులర్ ఫ్రాంచైజ్ నుంచి దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆరో సినిమా వచ్చింది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. గత సిరీస్ సినిమాల్లో లాగే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. సుమారు రూ.430 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2300 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఇలా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అయితే గుండె జబ్బులున్న వారు మాత్రం ఈ సినిమాకు దూరంగా ఉండడం మేలు. అలాగే చిన్న పిల్లలు కూడా చూడకపోవడమే మంచిది. ఇంతకీ ఆ భయానక సినిమా ఏదనుకుంటున్నారా? హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ సినిమా ‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్’










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!