
%20(1).png&w=3840&q=75)
ఐఐటీ హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ రికార్డు స్థాయి ప్యాకేజి తో జాబ్ సాధించారు. నెదర్లాండ్స్‌కు చెందిన గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ నుంచి ఆయనకు రూ.2.5 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగ ఆఫర్ లభించింది. ఇది 2008లో ఐఐటీ హైదరాబాద్ స్థాపన నుంచి ఇప్పటివరకు వచ్చిన అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం. రెండు నెలల సమ్మర్ ఇంటర్న్‌షిప్ అనంతరం వచ్చిన ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ (PPO) ద్వారా ఈ అవకాశం దక్కింది.
21 ఏళ్ల వర్గీస్ జులై నుంచి ఆప్టివర్ నెదర్లాండ్స్ కార్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించనున్నారు. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లో దేశవ్యాప్తంగా టాప్ 100లో నిలవడం తనకు పెద్దగా ఉపయోగపడిందని ఆయన తెలిపారు. ఈ ప్లేస్మెంట్ సీజన్లో మరో సిఎస్ విద్యార్థి రూ.1.1 కోట్ల ప్యాకేజీ సాధించగా, సంస్థ సగటు ప్యాకేజీ 75% పెరిగి రూ.36.2 లక్షలకు చేరింది. మొదటి దశ ప్లేస్మెంట్లలో 487 మంది యూజీ విద్యార్థుల్లో 62% మందికి ఉద్యోగాలు లభించాయి. ఫేజ్-2లో మరిన్ని దేశీయ కంపెనీలు పాల్గొంటాయని ఐఐటీహెచ్ ఆశాభావం వ్యక్తం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!