

శాండల్ వుడ్ స్టార్ యష్, కెజిఎఫ్ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకొని, మార్చి 19 న “టాక్సిక్” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా, ఇప్పటివరకు హీరోయిన్ల పోస్టర్లు మాత్రమే విడుదల కాగా, యష్ వైపు నుండి సాలిడ్ కంటెంట్ రాకపోవడం అభిమానుల్లో అంచనాలు పెంచింది. అయితే, యష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ద్వారా సినిమాలోని ఒక ముఖ్య ఎపిసోడ్ చూపిస్తూ, ఫ్యాన్స్ కు సినిమాకి సంబంధించిన హింట్ ఇచ్చారు.
టీజర్లో హీరో రాయ్ (యష్) క్యారెక్టర్ పరిచయం చేశారు. ఒక స్మశానంలో మాఫియా డాన్ కొడుకు దహన సంస్కారాలు జరుగుతున్న సమయంలో, రాయ్ కారులో వచ్చి, వైర్ల ద్వారా స్మశానంలో డైనమైట్ పెట్టి బయటకు రాకుండా బాంబులు పేలుస్తాడు. హాలీవుడ్ వెబ్ సిరీస్‌లలో మాత్రమే కనిపించే అడల్ట్ టైప్ విజువల్స్‌ను కూడా ఇందులో జోడించడం, ప్రేక్షకుల కోసం శాక్ ఇఫెక్ట్గా నిలుస్తుంది. యష్ మాస్ అవతారంలో అభిమానుల ఆశలను తీరుస్తున్నాడు.
ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పీరియాడిక్ సెటప్‌లో రూపొందించబడింది మరియు మార్చి 19 న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అదే రోజు “దురంధర్ 2” మరియు అడవి శేష్ “డెకాయిట్” కూడా రిలీజ్ అవుతుండగా, యష్ వెనుకడుగు వేయడం లేదు. రవి బస్రూర్ సంగీతం సాధారణంగానే ఇంటెన్సిటీతో ఉంది, మేకింగ్ క్వాలిటీ టాప్ స్టాండర్డ్‌లో ఉంది. యష్ తప్ప మరే ఇతర నటీనటుల వివరాలు రివీల్ చేయలేదు. కథా డిజైన్‌లో హీరో పాత్రను అంత స్పష్టంగా చూపించడం, మిగతా ఇతర కమర్షియల్ సినిమాలతో పోలిస్తే, ఒక మహిళా దర్శకురాలిగా కొత్తగా అనిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!