

సౌందర్య రజనీకాంత్ నేతృత్వంలోని జియన్ ఫిల్మ్స్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం విత్ లవ్ తెలుగులో ఘనంగా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 6, 2026 న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నజరత్ పసిలియన్, మగేష్ రాజ్ పసిలియన్ నిర్మించగా, సౌందర్య రజనీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.
ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి మదన్ కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ‘లవర్’, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన మదన్‌కు ఇది దర్శకుడిగా తొలి చిత్రం కావడం విశేషం.
‘చాంపియన్’ చిత్రంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అనస్వర రాజన్ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారు. అలాగే ఈ ఏడాది తమిళంలో భారీ విజయం సాధించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్ర దర్శకుడు అభిషన్ జీవింత్, ఈ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘అయో కథలే’ అనే తెలుగు తొలి పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!