
సినిమాలు

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.
ట్రైలర్లో పవన్ కళ్యాణ్ స్వాగ్, యాక్షన్ సన్నివేశాలు మరియు డైలాగ్ డెలివరీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో కథానాయికలుగా శ్రీలీల మరియు రాశీఖన్నా నటిస్తున్నారు. సినిమాకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రేపు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ట్రైలర్ చూసిన అభిమానులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!