
గాసిప్స్

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘స్కై’ ఈ నెల13 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృథ్వీ పెరిచెర్ల ఈ చిత్రాన్ని నిర్మించగా, పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహించారు.
ఈ నెల 6 న విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడగా, తాజాగా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, లిరికల్ సాంగ్స్‌తో ‘స్కై’ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంతో శివ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!