

సంక్రాంతి సందడి ముందుగానే మొదలైంది. మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి విడుదలైన హిలేరియస్ టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని రేపుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటికే గ్లింప్స్, పాటలతో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా వచ్చిన టీజర్ సంపూర్ణ వినోదాన్ని అందజేస్తోంది.
ఈ చిత్రంలో సంతోషంగా వివాహ జీవితం గడుపుతున్న వ్యక్తిగా రవితేజ కనిపిస్తారు. విదేశీ ప్రయాణంలో అనుకోకుండా మరో మహిళపై ఆకర్షణ కలగడంతో, అయోమయంలో పడిన ఆయన సైకియాట్రిస్ట్‌ను ఆశ్రయించడం కథలో వినోదభరితమైన మలుపులకు దారి తీస్తుంది. కామెడీ టైమింగ్‌లో రవితేజ మరోసారి తన సత్తా చూపించగా, డింపుల్ హయాతి భార్య పాత్రలో ఆకట్టుకుంటుంది. ఆశిక రంగనాథ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, సునీల్ పాత్ర సినిమాకు అదనపు వినోదాన్ని అందిస్తుంది. ప్రసాద్ మురెళ్ల విజువల్స్, భీమ్స్ సిసిరోలియో సంగీతంతో ఈ చిత్రం సంక్రాంతి ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందించనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!