
జనరల్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఉత్తర అమెరికాలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజా ప్రకటన ప్రకారం, ఈ సినిమా అమెరికా మరియు కెనడా వ్యాప్తంగా 750కి పైగా లొకేషన్లలో విడుదల కానుంది. దీంతో ఈ వేసవిలో అత్యంత భారీ స్థాయిలో విడుదల అవుతున్న చిత్రాల్లో ఒకటిగా ‘పెద్ది’ నిలవనుంది.

ప్రత్యంగిరా సినిమాస్ ఆధ్వర్యంలో జూన్ 3న గ్రాండ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయి విడుదలతో ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!