

ఇటీవల మెగా వారి ఇంట కవలలు అడుగుపెట్టి వారి ఫ్యామిలీలో సరికొత్త ఆనందాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఇంట ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇర చిరంజీవి (Chiranjeevi) అభిమానులు అయితే పట్టలేనంతగా మురిసిపోతూ వేడుకలు జరుపుకున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కూతురు క్లింకార ఉండగా ఇప్పుడు కవలలు ఓ కుమారుడు, ఓ కుమార్తె జన్మించారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని.. ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడంలో రామ్ చరణ్–ఉపాసన వెనుకాడలేదు. తమపై కురిపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా అభిమానులకు, తమ కార్యాలయాల్లో పని చేసే వారికి స్వీట్ బాక్సులు అందించారు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తూ షేర్ చేసిన వీడియోలో రెండు రకాల స్వీట్లు కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “రామ్ చరణ్ – ఉపాసనలకు శుభాకాంక్షలు.. అపోలో నుంచి ఈ బహుమతి అందింది” అంటూ ఇచ్చిన క్యాప్షన్ నెట్లో హల్చల్ చేస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!