

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా నిన్న థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దర్శకుడు మారుతి హారర్-ఫ్యాంటసీ జానర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అనుభవాన్ని ఇచ్చేలా తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రపంచ స్థాయిలో చిత్రాన్ని నిర్మించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో, హైదరాబాద్ లో ‘కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్’ కూడా నిర్వహించారు.
హీరోయిన్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రిద్ధి కుమార్ “ప్రేక్షకులు మా సినిమాను బాగా ఇష్టపడుతున్నారు. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. టీమ్ మొత్తం చాలా ఎఫర్ట్స్ పెట్టింది. మా ప్రయత్నానికి రిజల్ట్ గా ప్రేక్షకులు మంచి సక్సెస్ ఇచ్చారు.సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మా మూవీని అప్రిషియేట్ చేస్తూ చాలా మెసేజ్ లు వస్తున్నాయి. ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్", అన్నారు. నిధి అగర్వాల్ “సంక్రాంతికి పరిపూర్ణ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మొసలి ఎపిసోడ్, క్లైమాక్స్ లాంటి సీక్వెన్స్‌లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి” అన్నారు. మాళవిక మోహనన్ “భైరవి పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ గారి సరసన నటించడం డ్రీమ్ నిజమైంది. ఫ్యూచర్ లో మళ్లీ కలిసి నటించాలనుకుంటున్నా” అన్నారు.
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ “మా అంచనాలను మించి తొలి రోజు వరల్డ్ వైడ్ 112 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఫ్యామిలీ మరియు పిల్లల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ సీన్స్ ఇప్పుడు ప్రతి షోలో చూడవచ్చు” అన్నారు. దర్శకుడు మారుతి “మూడేళ్ల కష్టానికి, 40 నిమిషాల ప్రత్యేక ఎపిసోడ్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఫ్యాన్స్ సూచన మేరకు ఓల్డ్ గెటప్ సీన్స్ మరియు 8 నిమిషాల రూఫ్ ఫైట్ సీక్వెన్స్ ను యాడ్ చేసాం. ఇక ప్రేక్షకులు ‘రియల్ రాజా సాబ్’ ను చూడగలరు. సంక్రాంతికి వస్తున్న అన్ని మూవీస్ ఆదరణ పొందాలి. రాజా సాబ్ సినిమా చూసి అల్లు అర్జున్ ఫోన్ చేసి అభినందించాడు. నేను హ్యాపీగా ఉన్నాను. నార్మల్ రేట్స్ కే రాజా సాబ్ సినిమాను మీరు థియేటర్స్ లో చూడొచ్చు", అని అన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!