

అఖండ 2 విడుదల వాయిదా పడిన నేపథ్యంలో 14 రీల్స్ ప్లస్ అధికారికంగా స్పందించింది. తమ సోషల్ పేజీ ద్వారా, సినిమా ఆలస్యమవుతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. అనుకోని వివాదాలు, కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవ్వడం వల్ల విడుదల తేదీ మార్చక తప్పలేదని స్పష్టం చేసింది.
ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు తప్పనిసరిగా ఎదురవుతాయని, బాలకృష్ణ అభిమానులు మరికొంత ఓర్పుతో ఉండాలని సంస్థ కోరింది. ఈ పరిస్థితుల్లోనూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తమకు అండగా నిలిచారని 14 రీల్స్ ప్లస్ కృతజ్ఞతలు తెలిపింది. వారి సహకారం మరువలేనిదని పేర్కొంది.
అఖండ 2 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్షమాపణలు తెలుపుతూ, చాలా త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని హామీ ఇచ్చింది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం డిసెంబర్ 12 లేదా 25 తేదీల్లో అఖండ 2 థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!